హాట్ హాట్‌గా తెలుగు యాంక‌ర్ ఎఫైర్‌…!

-

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో పాపులర్ యాంకర్ గా వెలుగొందింది. టీవీ ఛానెల్స్‌లో ఎన్నో షోల‌కు వ్యాఖ్యాత‌గా ఉంటూ చాలా బిజీ లైఫ్ ఎంజాయ్ చేసింది. ఆ త‌ర్వాత త‌న కో యాంక‌ర్‌తో ప్రేమ‌లో ప‌డ‌డం.. పెళ్లి చేసుకోవ‌డం…. ఓ కూతురును క‌న్నాక వారిద్ద‌రు విడిపోవ‌డం జ‌రిగిపోయాయి. వీరు విడిపోయాక ఆ యాంక‌ర‌మ్మ మాజీ భ‌ర్త ఇటీవ‌లే మ‌రో పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇక యాంక‌ర‌మ్మ మాత్రం తన కూతురుతో కలిసి జీవిస్తోంది. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఈమెకి అవకాశాలు బాగా తగ్గాయి.

యంగ్ యాంకర్ల హవా పెరగడంతో షోలు చేయడం బాగా తగ్గించేసింది. అయినా కొన్ని టీవీ షోల్లో మాత్రం క‌నిపిస్తూ త‌న హంగామా చూపెడుతూ ఉంటోంది. ఇక ఆమె గురించి ఓ హాట్ హాట్ న్యూస్ వైర‌ల్ అవుతోంది. పెళ్లి తరువాత చాలా కాలంగా ఒంటరిగా ఉంటోన్న ఈమె ప్రస్తుతం ఓ బిజినెస్‌మేన్‌తో రిలేష‌న్‌లో ఉంద‌ట‌. గోవాలో బాగా పేరున్న ఆ బిజినెస్‌మేన్ ఈ యాంక‌ర‌మ్మ‌ను బాగా చూసుకుంటున్నాడ‌ట‌.

అత‌డితో ఎంజాయ్ చేసేందుకు ఈ యాంక‌ర‌మ్మ కూడా బాగా ఇష్ట‌ప‌డుతున్న‌ట్టు టాక్‌. వీళ్లు ఇద్దరు పెళ్లి చేసుకుంటారా..? లేదా..? అనే విషయంపై క్లారిటీ లేనప్పటికీ ప్రస్తుతం ఈ సీనియర్ యాంకర్ అతడితో ఎఫైర్ మాత్రం సాగిస్తోంది. ఈ మధ్యకాలంలో ఈ సీనియర్ యాంకర‌మ్మ‌కు సినిమా అవకాశాలు కూడా పెరిగాయి. ఇటీవల కూడా ఓ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది.

Read more RELATED
Recommended to you

Latest news