తెలుగు బిగ్ బాస్ 4 ఫైనల్ లిస్ట్ ఇదే !

-

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 కి అంతా రెడీ అయిపొయింది. ఈరోజు ఆరు గంటలకి మొదటి ఎపిసోడ్ టెలీకాస్ట్ కానుంది. దీని షూట్ నిన్ననే అన్నపూర్ణ స్థూడియోస్ లో వేసిన స్పెషల్ సెట్ లో పూర్తి అయింది. మాస్కులు ముఖానికి మాత్రమే కానీ ఎంటర్ టైన్ మెంట్ కు కాదు.. అంటూ హోస్ట్ నాగార్జున చెబుతున్న ప్రోమో ఒకటి అన్ని ఛానెల్స్ లో దంచి కొడుతోంది. అయితే తెలుగు ప్రేక్షకుల్లో ఇప్పుడు ఒకటే టెన్షన్ అదే కంటెస్టెంట్ లు ఎవరబ్బా ? అని ఈ కంటెస్టెంట్ల పేర్లు చాలా రోజుల నుండి సోషల్ మీడియాలో ఎప్పుడో వైరల్ అవుతున్నాయి.

అవన్నీ నిజమేనా అంటే కొంత వరకూ అవుననే చెప్పాలి. అయితే నిన్న షూట్ లో పాల్గొన్న వారి వివరాలు ఈమేరకు ఉన్నాయి. డైరెక్టర్ సూర్య కిరణ్, లాస్య, అమ్మ రాజశేఖర్, కరాటే కళ్యాణి, దేవీ వద్యతా,సింగర్ నోయల్, హీరోయిన్ మొనాల్ గజ్జర్, దేత్తడి హారిక, యాంకర్ అరియానా గ్లోరీ, సయ్యద్ సొహైల్, యూట్యూబర్ మెహబూబా దిల్ సే, టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా హీరో అభిజిత్, యూట్యూబర్ గంగవ్వ, అఖిల్ అనే మరో నటుడు, జోర్దార్ సుజాత అనే మరో యాంకర్ లు ఉన్నట్టు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version