దేశంలో ముకేశ్ అంబానీ ఓకే.. మన తెలుగోళ్లలో టాప్ ఎవరో తెలుసా..?

-

ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు.. అంటే ఈ ప్రపంచమంతా డబ్బు చుట్టూనే నడుస్తోంది. ఎప్పుడో పూర్వకాలంలో చెప్పినా..ఇప్పటికీ పరిస్థితి ఏమాత్రం మారలేదు. అందుకే డబ్బున్నవారంటే అందరికీ గౌరవమే.. ఏ విధంగా సంపాదించినా సరే.. శ్రీమంతుల డాబు దర్పం అందరినీ ఆకర్షిస్తాయి.

అందుకే ప్రపంచంలో ధనవంతులెవరు.. ఎక్కువగా సంపాదించే వారు ఎవరు.. ఇలాంటి వివరాలను కొన్ని సర్వే సంస్థలు ఎప్పటికప్పుడు ప్రకటిస్తుంటాయి. ఇలా ప్రకటించే సంస్థల్లో ఐఐఎఫ్ ఎల్ వెల్త్ అనే సంస్థ ఒకటి.. ఆ సంస్థ। తాజాగా తన సర్వే ఫలితాలు ప్రకటించింది. దేశంలోనే టాప్ 100 ధనవంతుల జాబితా విడుదల చేసింది.

ఈ సంస్థ ప్రకారం.. వరుసగా ఎనిమిదోసారి ముఖేశ్‌ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన ఆస్తుల విలువ అక్షరాలా రూ. 3,80,700 కోట్లు. రూ. 1,86,500 కోట్ల సంపదతో హిందుజా కుటుంబం సెకండ్ ప్లేస్ సంపాదించింది. విప్రో వ్యవస్థాపకుడు అజిమ్‌ ప్రేమ్‌జీ మూడో స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ. 1,17,100 కోట్లు. ఆ తర్వాత స్థానాల్లో ఎల్‌ఎన్‌ మిత్తల్‌, గౌతమ్‌ అదానీ, ఉదయ్‌ కొటక్‌, సైరస్‌ ఎస్‌ పూనావాలా, పల్లోంజి మిస్త్రీ, షాపూర్‌ పల్లోంజి, దిలీప్‌ షంఘ్వీ ఉన్నారు.

Image Source : Newindianexpress

ఈ టాప్ 100లో మన తెలుగు వారు కూడా చోటు దక్కించుకున్నారు. అరోబిందా ఫార్మా చైర్మన్ పి.వి.రామ్ ప్రసాద్ రెడ్డి ఆస్తుల విలువ రూ.14,800 కోట్లతో 51వ స్థానంలో ఉన్నారు. తెలుగువారిలో ఈయనే టాప్. ఆ తర్వాత మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్టర్స్ ప్రమోటర్ పి.వి.రెడ్డి రూ.13,400 కోట్లతో 57వ స్థానంలో ఉన్నారు. ఇదే సంస్థకు చెందిన మరో ప్రమోటర్ పి.వి. కృష్ణారెడ్డి రూ. 12,900 కోట్లతో 63వ స్థానంలో ఉన్నారు.

వీరు కాకుండా.. 83వ స్ధానంలో దివీస్ కిర‌ణ్‌ ఉన్నారు. 89వ స్ధానంలో దివీస్ నీలిమ‌ ఉన్నారు. టాప్ 100 జాబితాలో స్థానాలు ఉన్నవారు వీరే.. ఇక ఇదే జాబితాలో 100 ర్యాంకు దాటిన తెలుగు వారు ఎవరంటే.. కె.సతీష్ రెడ్డి రూ.7000 కోట్లతో 129వ స్థానం. జి.వి.ప్రసాద్, జి అనురాధ రూ.5900 కోట్లతో 154వ స్థానంలో ఉన్నారు.

ఎమ్.సత్యనారాయణ రెడ్డి రూ.5600 కోట్లతో 163వ స్థానం సంపాదించుకున్నారు. హెటిరో డ్రగ్స్ అధినేత బండి పార్ధసారధి రెడ్డి, వి.సి. నన్నపనేని వీరిద్దరూ రూ. 5200 కోట్లతో 174వ స్థానంలో ఉన్నారు. కేసీఆర్ దోస్తుగా పేరున్న మై హోమ్ ఇండస్ట్రీస్ అధినేత జూపల్లి రామేశ్వర్‌రావు రూ.4500 కోట్లతో 195వ స్థానంలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version