తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. నెమ్మదిగా ఉష్ణ్రోగ్రతలు పడిపోతుండటంతో ఉదయం బయటకు వచ్చేందుకు జనాలు జంకుతున్నారు. ఇక రోడ్ల మీద వాహనదారుల ఇబ్బందులు మాములుగా లేవు. రహదారుల వెంట పొగమంచు కమ్ముకుంటోంది.ఫలితంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని భయాందోళనకు గురవుతున్నారు.
ఇక రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతోంది.ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 8.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవ్వగా.. మెదక్‌లో 10.8 డిగ్రీలు, పటాన్‌చెరులో 11 డిగ్రీలు. నిజామాబాద్‌లో 13.5, హనుమకొండలో 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలితీవ్రత కారణంగా పెద్దలు, వయోవృద్ధులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.