విశాఖ బస్సులో మహిళలపై యాసిడ్ దాడి జరిగింది. ఈ సంఘటన ఇవాళ వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన జరిగింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశాడని భావిస్తున్నారని సమాచారం. ఈ ఘటన గిరిజాలకు వెళుతున్న బస్సులో ఐటీఐ జంక్షన్ వద్ద చోటు చేసుకుందని చెబుతున్నారు.
బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు గగ్గోలు పెట్టడంతో డ్రైవర్ వెంటనే బస్సును ఆపి, స్థానికుల సాయంతో బాధితులను సమీపంలోని హాస్పిటల్కు తరలించారట. ఇక ఈ సమాచారం అందుకున్న కంచరపాలెం CI చంద్రశేఖర్ వెంటనే ఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. దాడిలో ఉపయోగించినది నిజంగానే యాసిడ్ కాదు ఇతర ద్రావణమా అనే దానిపై పరీక్షలు జరుగుతున్నాయని వెల్లడించారు పోలీసులు. ఇక ఈ ఘటన స్థానికులలో తీవ్ర కలకలం రేపుతోంది. బాధితుల ఆరోగ్య పరిస్థితి పట్ల ఇంకా స్పష్టత రాలేదని అంటున్నారు. ఈ దాడి వెనుక కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.