దేశం లో కరోనా కేసులు విచ్చలవిడిగా పెరిపోతున్నాయి. ప్రతీ రోజు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నా ప్రజలు మాత్రం పెద్దగా భయపడటం లేదు. ఎవరికి నచ్చినట్టు వారు ఉంటున్నారు, మాస్కూలు పెట్టుకోండి సామాజిక దూరం పాటించండి అంటూ ప్రభుత్వాలు చేతులెత్తి చెబుతున్నా వారి మాటలౌ పట్టించుకోవడం లేదు, నియమాలను తుంగలో తొక్కుతున్నారు. తాజాగా అసోం రాష్ట్రం లోని నాగావ్ జిల్లాలో ఓ ఇస్లాం మత పెద్ద మరణించాడు ఆయన అంత్యక్రియలకు దాదాపుగా మూడు గ్రామాల నుండి 10 వేల మంది వరకూ పాల్గొన్నారు.
వివరాల్లోకి వెళితే… అసోం రాష్ట్రం లోని నాగావ్ జిల్లాలో అఖిల భారత జమైత్ ఉలేమా ఉపాధ్యక్షుడు, ఈశాన్య రాష్ట్రాల అమిర్–ఇ–షరియత్ అయిన ఖైరుల్ ఇస్లాం (87) ఈ నెల మొదటి వారంలో మృతి చెందాడు కాగా ఆయన అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఆ అంత్యక్రియలకు దాదాపుగా 10 వేల మంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు, కరోనా అనే భయం కూడా ఈ చర్యకు సిద్ధం అయ్యారు విషయం తెలుసుకున్న ప్రభుత్వం ఆ మూడు గ్రామాల్లో లాక్ డౌన్ ప్రకటించింది. అంత్యక్రియల నిమిత్తం ఎంతమందికి కరోనా సోకి ఉంటుందో అని ప్రభుత్వం వణికిపోతుంది.