వైరల్ వీడియో;పక్కింటి అమ్మాయితో టెన్నీస్ ఇలా కూడా ఆడతారా…?

-

టెన్నిస్ అంటే ఎలా ఆడతారు…? ఒక చిన్న గ్రౌండ్ లో నెట్ పెట్టుకుని ఆడుతూ ఉంటారు. అది ఎవరు అయినా సరే అంతే. కాని ఒక ఇద్దరు అమ్మాయిలు మాత్రం పొరుగున ఉన్న భవనాల పైకప్పుల మీద టెన్నిస్ ఆడారు. ఇటలీలోని ఇద్దరు యువతులు ఇలాగే చేసారు. దేశవ్యాప్తంగా కరోనావైరస్ లాక్డౌన్ ఉంది. అయినా సరే తమకు టెన్నీస్ మీద ఉన్న ప్రేమను ఆ ఇద్దరు ఇలా చాటుకున్నారు.

లిగురియన్ పట్టణమైన ఫినాలే లిగురేలోని బాలికలు 12-షాట్ల వీడియో ని గత శుక్రవారం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసారు. 24 సెకన్ల ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. కొన్ని బంతులను ఆ ఇద్దరు సమర్ధవంతంగా ఆడినా కొన్ని మాత్రం రోడ్డు మీద పడ్డాయి. అయితే వాళ్ళు ఆడుకోవడానికి తల్లి తండ్రులు బంతులను ఇచ్చారు. ఇలా దాదాపు ఇద్దరూ గంటకు పైగా ఆడుకున్నారు.

లాక్ డౌన్ లో తమకు బోర్ కొట్టడం తో ఆ ఇద్దరు ఇలా చేసారని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరి కొందరు ఆ ఇద్దరు ప్రపంచానికి కొత్త విషయాలు చెప్తున్నారని అంటున్నారు. ఈ వీడియో చూసిన పిల్లలు మాత్రం తాము కూడా ఇలా ట్రై చెయ్యాలి అని భావిస్తున్నారు. తమ పక్కింటి వాళ్ళతో ఇలా ఆడుకుని తమ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పాలి అని చూస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version