పూలపై రోజా క్లారిటీ : తిన్నది అరక్క అంటూ…!

-

“వైకాపా నగరి ఎమ్మెల్యే రోజా నడుస్తుంటే… ప్రజలు పూలు చల్లారు” అనే విషయంపై రాజకీయ రచ్చ జరిగిన సంగతి తెలిసిందే! ఈ విషయాలపై ఏపీ టీడీపీ నేతలు… “కరోనా ప్రభలడానికి వైకాపా నేతలే కారణం” అన్న రేంజ్ లో కామెంట్లు కూడా చేసేశారు! ఈ క్రమంలో అసలు అక్కడ ఏమి జరిగింది.. ఆ పనిచేసినందుకు ప్రజలు ఆ స్థాయిలో ఎందుకు రియాక్ట్ అయ్యారు.. దానికి కారణం ఎవ్వరు.. ఇంతకాలం టీడీపీ పాలనలో పుత్తురులో ఈ సమస్య ఎందుకు ఉంది… అంటూ రోజా స్పందించారు!

వివరాళ్లోకి వెళ్తే… చిత్తురు జిల్లా పుత్తురులోని సుందరయ్య కాలనీలో నీటిసదుపాయం కల్పించడానికి వెళ్లిన సందర్భంగా అక్కడి ప్రజలు పూలు చల్లిన సంగతి తెలిసిందే. ఈ విషయాలపై రేగిన దుమారంపై క్లారిటీ ఇచ్చారు రోజా! గత 10 సంవత్సరాలుగా సుందరయ్యకాలనీలోని జనాలకు నీళ్లు లేవని.. సడన్ గా వారికి ఆ సమస్య దూరం అయ్యే సరికి వారి ఆనందాన్ని అలా చూపించారని తెలిపారు. ఈ పూల కార్యక్రమం తనకు ముందుగా కూడా తెలియదని క్లారిటీ ఇచ్చారు. ఈ సమయంలో పూలు చల్లిన మహిళలు అంతా చేతులకు గ్లౌజులు వేసుకుని, ముఖానికి మాస్కులు కట్టుకుని, భౌతిక దూరం పాటించారని, ఆ విషయం వీడియోలో తెలిస్తుందని వివరణ ఇచ్చారు రోజా! అనంతరం బాబుల ప్రస్థావన తెచ్చారు!

గత ఐదుసంవత్సరాలు టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉందని, ఇది చంద్రబాబు సొంత జిల్లా అని… అయినా కూడా ఇక్కడి ప్రజలకు నీళ్లు ఇవ్వలేకపోవడానికి సిగ్గు పడాల్సింది పోయి.. ఇచ్చిన వారిపై విమర్శలు చేయడం ఏమిటనే స్థాయిలో రోజా.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు! ఇదే క్రమంలో “ప్రజలకు పనికొచ్చే పని గురించి తాను బయటకు వస్తే ఇంత గగ్గోలు పెడుతున్నా మీరు… మీ కొడుకు తిన్నది అరక్క, మాస్కులు లేకుండా సైకిల్ ఎక్కి తిరగుతుంటే అతన్ని ఏమి చేయలి” అని రోజా సూటిగా ప్రశ్నించారు! దీంతో… “రోజాపై పూలు” అనే రచ్చపై ఒక క్లారిటీ వచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు!

Read more RELATED
Recommended to you

Exit mobile version