అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ రిటైర్మెెంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. టెన్నిస్‌కు మెల్లమెల్లగా దూరమవుతున్నట్లు ప్రకటించింది. యూఎస్ ఓపెన్ అనంతరం టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించానని, టెన్నిస్ నుంచి తప్పుకోవడానికి సిద్ధమేనని ఆమె రాసిన ఓ వ్యాసాన్ని వోగ్ మ్యాగజైన్ విడుదల చేసింది. ఈ సందర్భంగా రిటైర్మెంట్ అనే పదం తనకు ఇష్టం లేదని.. టెన్నిస్‌కు దూరంగా ఉంటూ తనకిష్టమైన ఇతర విషయాల పట్ల దృష్టి సారిస్తానని ఆమె చెప్పింది.
ప్రస్తుత ప్రొఫెషనల్(ఓపెన్ ఎరా) శకంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచింది సెరెనా విలియమ్స్. ఈ ఘనత మరే టెన్నిస్ క్రీడాకారుడికి కూడా సాధ్యం కాలేదు. రికార్డు స్థాయిలో 23 గ్రాండ్‌స్లామ్‌లు సొంతం చేసుకుంది అమెరికా నల్లకలువ. ఆల్‌టైమ్ అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించిన రికార్డు మార్గరెట్ కోర్ట్(ఆస్ట్రేలియా) పేరిట ఉంది. ఆమె మొత్తం 24 టైటిళ్లు గెల్చుకుంది.
In Vogue’s September issue, @serenawilliams prepares to say farewell to tennis on her own terms and in her own words. “It’s the hardest thing that I could ever imagine,” she says. “I don’t want it to be over, but at the same time I’m ready for what’s next” https://t.co/6Zr0UXVTH1 pic.twitter.com/YtGtcc18a9
— Vogue Magazine (@voguemagazine) August 9, 2022