అశోక్ నగర్‌లో మళ్లీ టెన్షన్ వాతావరణం.. రోడ్డుపైకి అభ్యర్థులు!

-

గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని, జీవో 29 రద్దు చేయాలని అభ్యర్థులు గత రెండు రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి నుంచి అభ్యర్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేనియెడల ఆందోళనలను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ క్రమంలోనే ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని అశోక్ నగర్ వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో గ్రూప్-1 అభ్యర్థులు మరోసారి రోడ్డు మీదకు వచ్చారు. దీంతో లా ఎక్స్ లెన్స్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరికాసేపట్లో గ్రూప్-1 అభ్యర్థులు ప్రెస్‌మీట్ నిర్వహిస్తారని సమాచారం. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా, శనివారం గ్రూప్-1 అభ్యర్థులు చేస్తున్న నిరసనకు కేంద్ర హోంసహాయ మంత్రి బండి సంజయ్ మద్దతు ఇవ్వడంతో పాటు సెక్రటేరియట్ ముట్టడికి ర్యాలీగా వెళ్లడంతో పోలీసులు మధ్యలోనే వారిని అడ్డుకుని అరెస్టు చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version