కొడంగల్‌లో మళ్లీ ఉద్రిక్తత..రోటిబండలో తిరగబడ్డ రైతులు

-

నల్గొండ జిల్లాలోని కొడంగల్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం రోటిబండ తండాలో పోలీసులు భారీగా మోహరించారు. పారిశ్రామికవాడ ఏర్పాటు కోసం అధికారులు భూ సర్వేకు నిర్వహించేందుకు వచ్చారు.

దీంతో రోటిబండ తండాలోని రైతులు తమ భూములు ఇవ్వబోమని అధికారులకు ఎదురుతిరిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినా తమ భూములు ఇచ్చేది లేదంటూ రైతులు తిరగబడి నిరసన చేపట్టారు. కాగా, ఇటీవల ఫార్మాసిటీ ఏర్పాటు కోసం లగచర్లలో భూములు ఇవ్వాలని రేవంత్ సర్కారు చెప్పగా. అక్కడి రైతులు పెద్దఎత్తున ఆందోళన చేయగా.. తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కలెక్టర్ వాహనంపై కొందరు దాడులకు పాల్పడ్డారు. దీంతో వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

 

 

Read more RELATED
Recommended to you

Latest news