బండి సంజయ్‌కి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి జీవో 29పై చర్చకు రావాలని ఆహ్వానించారు. గ్రూపు-1 అభ్యర్థులతో కలిసి బండి సంజయ్ ర్యాలీగా సెక్రటేరియట్‌కు బయల్దేరిన విషయం తెలిసిందే. అడుగడుగునా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసుల తీరుపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వాస్తవాలు వివరించేందుకు వెళ్తున్నామని బండి స్పష్టంచేశారు. ఎలాగైనా సచివాలయానికి వెళ్లి తీరుతామని తెలిపారు.దీంతో పోలీసులు బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు.గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల వాయిదా, జీవో 29ని రద్దు చేయాలని కోరుతూ అభ్యర్థులు గత కొన్ని రోజులుగా నిరసనలు చేస్తుండగా.. బండి సంజయ్ హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌కు వెళ్లి గ్రూప్-1 అభ్యర్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఛలో సచివాలయం పిలుపునివ్వగా ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.