పిల్లలు తప్పులు చేస్తే దానికి బాధ్యత తల్లిదండ్రులది.. ఎందుకంటే వారిని పెంచే క్రమంలో ముద్దుచేయడమే కాదు, విలువలతో పెంచాలి, తప్పుచేస్తే దాని ఫలితం చెప్పి దానికి సరిపడా శిక్షను కూడా వేయాలి.. కాని నేటికాలంలో ఎందరో తల్లిదండ్రులు పిల్లలకు ఏం కావాలంటే అది సమకూరుస్తున్నారు గానీ, వారికి సమకూర్చిన సదుపాయాల వల్ల వారు వాటిని ఎలా ఉపయోగించుకుంటున్నారనేది మాత్రం గ్రహించడంలేదు.. అందువల్ల బాధ్యతగల పౌరులుగా పెరగవలసిన వారు, బాధ్యతరాహిత్యంగా మారి సమాజానికి చీడపురుగుల్లా మారుతున్నారు.. ఇందుకు ఉదాహరణ ఈ సంఘటన..
తమిళనాడులోని కోయంబత్తూరు నగరంలోని సుందరపురం ప్రాంతానికి చెందిన బాలిక (11) స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. కాగా తల్లిలేని ఈ బాలిక తండ్రి, అత్తతో కలసి ఒక ఇంటి పై పోర్షన్లో అద్దెకుంటున్నారు.. వారింట్లో టీవీ లేకపోవడంతో ఆమెకు సమయం చిక్కినప్పుడల్లా టీవీ చూసేందుకు కింది అంతస్తులోని ఇంటి ఓనర్ ఇంటికి వెళ్లేది. ఈ క్రమంలో ఒకరోజు పదో తరగతి చదువుతున్న ఓనర్ కొడుకు(16), అతని స్నేహితుడు(17) కలిసి ఆన్‌లైన్ పాఠాల కోసం ఇచ్చిన సెల్‌ఫోన్ లో, అశ్లీల వీడియోలు చూస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వెళ్లిన బాలిక వారి వాలకాన్ని గమనించి వెనుదిరిగింది.
ఇంతలో ఆ ఇద్దరు మైనర్ బాలురు ఆ బాలికను అడ్డుకుని బలవంతంగా సెక్స్ వీడియోలు చూపించడమే కాకుండా ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. అంతే కాకుండా మరో స్నేహితుడికి ఫోన్ చేసి పిలిపించగా అతను కూడా రేప్ చేసాడు.. ఇలా వారం రోజుల అనంతరం ఆముగ్గురు కలిసి మరోసారి ఆమెపై గ్యాంగ్ రేప్ చేసి, ఎవరికైనా చంపేస్తామని బెదిరించారట.. దీంతో వీరి బెదిరింపులకు భయపడిపోయిన బాలిక తన బాధను మనసులోనే దాచుకుంది.. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ బాలికకు భయంకరమైన కడుపునొప్పి రావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.ఇక బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా, మూడోవాడు తప్పించుకు తిరుగుతున్నాడట.. అతని కోసం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.