రాష్ట్రంలో సంభవించిన ఎస్ఎల్‌బీసీ ప్రమాదంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.టన్నెల్ ప్రమాదంలో మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోగా కేవలం ఇద్దరి మృత దేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మిగతా వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. దాదాపు 63 రోజుల పాటు కొనసాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్‌కు శనివారం బ్రేక్ పడింది.
టన్నెల్‌లో నిర్వరామంగా వర్క్ చేసిన ఎక్సవేటర్లు బయటకు వచ్చాయి. శిథిలాల తొలగింపు దాదాపు పూర్తి అయినట్లు సమాచారం. కేవలం డేంజర్ జోన్‌లో మాత్రమే శిథిలాలను తొలగించాల్సి ఉంది. దీంతో సాంకేతిక కమిటీ సూచనల మేరకు మూడు నెలల పాటు ఈ సహాయక చర్యలను అధికారులు నిలిపివేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన SLBC టన్నెల్ పనుల్లో ఫిబ్రవరి 22న పైకప్పు కూలి ప్రమాదం సంభవించింది.