ఉగ్రదాడి ఘటన… ఎయిర్ పోర్టులోనే మోడీ అత్యవసర మీటింగ్ నిర్వహించారు. ఉగ్రదాడిపై ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. సౌదీ అరేబియా పర్యటనను అర్ధంతరంగా ముగించుకొని బుధవారం ఉదయం భారత్‌కు చేరుకున్న ప్రధాని.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులోనే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తదితరులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.

ఈ ఉగ్రదాడిపై చర్చించేందుకు ఉదయం 11 గంటలకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ కానుంది. కాగా జమ్మూ ఉగ్రదాడిలో హైదరాబాద్ ఐబీ అధికారి మృతి చెందారు. మృతుడు ఐబీ అధికారి మనీష్ రంజన్‌గా గుర్తించారు. తన భార్య, ఇద్దరు పిల్లల ముందే కాల్చి చంపారు ఉగ్రవాదులు. హైదరాబాద్‌లో ఐబీ సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు మనీష్ రంజన్. పర్యటన కోసం కాశ్మీర్ వెళ్లిన మనీష్ రంజన్ ను తన భార్య, ఇద్దరు పిల్లల ముందే కాల్చి చంపారు ఉగ్రవాదులు.