పాకిస్తాన్ టెర్రరిస్టులను పెంచి పోషిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ, అంతర్జాతీయ సమాజం ముందు మాత్రం టెర్రరిస్టులకు మాకు ఎలాంటి సంబంధం లేదని బుకాయిస్తుంటుంది. ఎంతో మంది కరుడు గట్టిన ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా ఉగ్రవాదులను తయారు చేసి భారత్ మీదకు పంపిస్తుంటుంది.
ఈ క్రమంలో భారత్ పహెల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకుంది. నిన్న రాత్రి ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తానో వైమానిక దాడులు చేసి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడిలో 80 మందికి పైగా ఉగ్రవాదులు మరణించగా.. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, గాయపడిన జైషే మహ్మద్ ఉగ్రవాదులను పాకిస్థాన్ సీనియర్ ఆర్మీ ఆఫీసర్ ఆస్పత్రికి వెళ్లి వారి ఆరోగ్యంపై ఆరా తీశారు.దీని బట్టి పాకిస్థాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని నెట్టింట చర్చ జరుగుతోంది.
తన వక్రబుద్ధిని మరోసారి చూపించిన పాకిస్థాన్ #OperationSindoor లో గాయపడ్డ జైషే మహ్మద్ ఉగ్రవాదులను పాకిస్థాన్ సీనియర్ ఆర్మీ ఆఫీసర్ ఆస్పత్రికి వెళ్లి వారి ఆరోగ్యంపై ఆరా తీశారు.
దీని బట్టి పాకిస్థాన్ ఉగ్రవాదులను ఎంత పెంచి పోషితుందో అర్ధం అవుతుంది అంటూ నెటిజన్లు కామెంట్… pic.twitter.com/xrC8OLUxTX
— greatandhra (@greatandhranews) May 7, 2025