తమిళనాడు రాష్ట్రంలో ఉగ్రవాదుల ప్రవేశం కలకలం రేపుతోంది. దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో ఉగ్రవాదులు ప్రవేశించారని… ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని… హెచ్చరికలు జారీ చేసింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. సుమారు పదిహేను మంది సముద్రమార్గం ద్వారా తమిళనాడు రాష్ట్రంలోని ప్రవేశించారని పేర్కొంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.
తీరం నుంచి కేరళ రాష్ట్రానికి వెళ్లి… అక్కడి నుంచి పాకిస్థాన్ చేరుకునేందుకు పథకం వేశారని… వెల్లడించింది కేంద్రం. దీంతో తమిళనాడు ప్రభుత్వం అలర్ట్ అయింది. అంతేకాదు తమిళనాడు రాష్ట్రంలోని కోస్ట్ గార్డ్ దళాలు మరియు ఎన్.ఐ.ఏ అధికారులు నిఘా పెట్టారు. ఎవరై నా అనుమానాస్పదంగా సంచరిస్తే సమాచారం ఇవ్వాలని స్థానికులు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇది ఇలా ఉండగా చెన్నై పుందా మల్లి లోని ఓ అపార్ట్మెంట్ లో అనుమానాస్పదంగా ఉంటున్న ఇద్దరిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని పోలీసులు విచారణ చేస్తున్నారు.