N కన్వెన్షన్ కూల్చేతలపై హైడ్రా క్లారిటీ..!

-

N కన్వెన్షన్ కూల్చేతల పై హైడ్రా స్పందించింది. చట్ట ప్రకారమే N కన్వెన్షన్ లోని కట్టడాలను కూల్చివేశం అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. N కన్వెన్షన్ పై ఎలాంటి స్టే లేదు. హైకోర్టులో స్టే ఇచ్చినట్టుగా చెప్తుంది పూర్తిగా అవాస్తవం అని ఆయన అన్నారు. ఎఫ్టిలో కట్టడాలు ఉన్నందునే కూల్చి వేయడం జరిగింది. చెరువుని పూర్తిగా కబ్జా చేసి ఈ నిర్మాణాలు చేశారు. కాబట్టి చట్ట ప్రకారమే హైడ్రా వ్యవహరించి కట్టడాలని కూల్చివేశం అని రంగనాథ్ తెలిపారు.

అయితే కట్టడాలని క్రమబద్ధీకరన చేసేందుకు N కన్వెన్షన్ యాజమాన్యం ప్రయత్నించింది. కానీ N కన్వెన్షన్ రిక్వెస్ట్ ని అధికారులు గతంలోనే తిరస్కరించారు. అయితే ఇప్పటికే N కన్వెన్షన్ పైన లోకా యుక్త పాటు హైకోర్టు తీర్పులు ఉన్నాయి. N కన్వెన్షన్ లో పూర్తిగా అన్ని కట్టడాలని నేలమట్టం చేశాం. కాబట్టి ప్రస్తుతం N కన్వెన్షన్ జీరో గా మారింది అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version