తెలంగాణ విద్యార్థులకు శుభవార్త..మరోసారి ‘టెట్’ నిర్వహణకు ప్రతిపాదన

-

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET)ను నిర్వహించేందుకు ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ఏటా ఒకసారి తప్పకుండా టెట్ నిర్వహించాల్సి ఉంది. గత ఏడాది జూన్ 12న టెట్ నిర్వహించారు.

ఈ ఏడాది కాలంలో డిఈడి, బిఈడి ఉత్తీర్ణులైన వారు 20,000 మంది వరకు ఉంటారని అంచనా. వీరు TETకి అర్హులు కావాలంటే తప్పకుండా టెట్ రాయాల్సి ఉంది. టెట్ లో మార్కులకు ర్యాంకింగ్స్ లో 20% వెయిటేజీ ఇస్తారు. కాగా, ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూళ్లలో చదివే 16.82 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం రాగి జావ అందించనుంది. మధ్యాహ్న భోజనానికి అదనంగా ఏడాదిలో 110 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనుంది. ఈ మేరకు ప్రధానమంత్రి పోషణ్ పథకం అమలుకు రాష్ట్రం ఇటీవల ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ. 27.16 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. కేంద్రం రూ. 16.18 కోట్లు, రాష్ట్రం రూ.11.58 కోట్లు భరించనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version