గుడ్ న్యూస్.. TET క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్ జీవితకాలం చెల్లుబాటు

-

బోధనలో ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET ) ను 2011 లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది.ఈ పరీక్ష రాయడానికి D.ed,B.ed పూర్తి చేసి ఉండాలి. ఈ పరీక్షలో Oc లు 60% కంటే,bc లు 50% కంటే,sc st లు 40% కంటే ఎక్కువగా మార్కులు సాధించిన వారికే డీఎస్సీకి అర్హుడు.. ఉపాధ్యాయ అర్హత పరీక్ష ధృవీకరణ పత్రం యొక్క చెల్లుబాటు ఏడు సంవత్సరాలుగా ఉంది.

టెట్ క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్ చెల్లుబాటు సమయాన్ని ఏడేళ్ల నుంచి జీవితకాలానికి పెంచుతూ కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) అర్హత ధృవీకరణ పత్రం యొక్క చెల్లుబాటు వ్యవధిని పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ ప్రకటించారు.  2011 నుంచి ఈ నిర్ణయం అమలయ్యేలా కేంద్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. గతంలో 7యేళ్ళ కోసారి టెట్ వ్యాలిడిటీ అయిపోయేది. మళ్ళీ ఫ్రెష్ రాసుకోవాల్సి వచ్చేది. 7 ఏళ్ల కాలపరిమితి ముగిసిన వారికి రీవ్యాలిటేడ్ చేయాలని లేదా కొత్త టెట్ సర్టిఫికెట్ జారీ చేయాలని సూచించారు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాలు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇక నుంచి ఒక్క సారి టెట్ పాసైతే లైఫ్ టైమ్ వరకూ పనికొస్తుందని ప్రకటించింది. ఒక‌సారి టెట్ లో అర్హత సాధిస్తే జీవిత కాలం వ్యాలిడిటీ ఉంటుంద‌ని తీర్మానించింది.

teachers day Special Story

బోధనా రంగంలో వృత్తిని కోరుకునే అభ్యర్థులకు ఉపాధి అవకాశాలను పెంచడంలో ఇది ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని పోఖ్రియాల్ అన్నారు. గ‌తంలో జారీ చేసిన స‌ర్టిఫికెట్ల స్థానంలో కొత్త‌గా మ‌ళ్లీ ఇచ్చేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్ర / యుటి ప్రభుత్వాలను కోరినట్లు ఆయన చెప్పారు.

ఉపాధ్యాయ అర్హ‌త సాధించాలంటే TET తప్పనిసరి. కేంద్రప్రభుత్వ నియమనిబంధనల ప్రకారం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) ను రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తుంది. ఉపాధ్యాయ ఉద్యోగ ఎంపికకు ఈ పరిక్షలో అర్హత సాధించడం తప్పనిసరి. రాష్ట్రప్రభుత్వం నిర్వహించే డీఎస్సీ పరీక్షలో కూడా టెట్ కు వెయిటేజీ ఇస్తారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తేదీ నుండి ఏడు సంవత్సరాల వరకు సర్టిఫికేట్ యొక్క చెల్లుబాటుగా ఉండేది. కొత్త‌గా వ‌చ్చిన స‌వ‌ర‌ణ‌తో స‌ర్టిఫికేట్ చెల్లుబాటు వ్య‌వ‌ధి జీవితకాలం చెల్లుబాటు అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version