తెలంగాణ నుంచి అరుణాచలం పుణ్యక్షేత్రం వెళ్లే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో తెలంగాణ ఆర్టీసీ సంస్థ ప్రయాణికుల సౌకర్యార్థం అరుణాచలం క్షేత్రానికి స్పెషల్ బస్సులను నడుపుతోంది. ముఖ్యంగా గిరిప్రదక్షిణ కోసం వెళ్లే వారికి ఈ బస్సు సర్వీసులను అందుబాటులో ఉంచుతున్నట్లు టీజీఎస్ఆర్టీసీ పేర్కొంది.హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్ నగర్ నుంచి ఈ బస్సు సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి.
ఈనెల 16వ తేదీన రాత్రి 7.15 గంటలకు దిల్‌సుఖ్ నగర్‌లోని హైదరాబాద్-2 డిపో నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు బయలుదేరుతుందని డిపో మేనేజర్ కృష్ణమూర్తి తెలిపారు. కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ మీదుగా అరుణాచలంకు చేరుకుంటుందని వెల్లడించారు. ఒక్కొక్కరికి టికెట్ ధర రూ.3,700 ఉంటుందని, సెప్టెంబర్ 19న అరుణాచలం నుంచి తిరిగి బస్సు ప్రారంభం అవుతుందని తెలిపారు.