డబ్బుల కోసమే సినిమా తీస్తున్నాం, దేశాన్ని ఉద్ధరించడానికే కాదు : తమ్మారెడ్డి సంచలనం

-

డబ్బుల కోసమే సినిమా తీస్తున్నాం, దేశాన్ని ఉద్ధరించడానికే కాదని సినీ నిర్మాత తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టిక్కెట్లు ఇంతకు ముందు ఎక్కువ రేట్లకు అమ్మాము.. టాక్స్ కట్టలేదు. ఇప్పుడు టిక్కెట్ రేట్లు తగ్గించారు, టాక్స్ కట్టాల్సి వస్తోందని ఏపీ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని సినిమాలకు వేలు వేలు పెట్టి ప్రేక్షకులు చూస్తున్నారు… ఆ డిమాండ్ ను క్యాష్ చేసుకోవాలని ఆశిస్తున్నామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

బాంబేలో మూడు వేలు పెట్టి ఇంగ్లీషు సినిమా చూశానని… ఛాంబర్ లో మీటింగ్ పెడితే ఎంత మంది వస్తారు ? అని సినీ ప్రముఖులపై ఫైర్ అయ్యారు. అవసరం వస్తే కరోనా వస్తుంది. అవసరం లేకుంటే ఎవరికి ఏమి రాదన్నారు. నేను నాకున్న హక్కుతో ప్రజల ముందుకు వచ్చి మాట్లాడుతున్నానని… నేను ఏది ఉన్నా ఇండస్ట్రీ కోసమే చేస్తున్నానని పేర్కొన్నారు.

ఏపీ ప్రభుత్వం చిరంజీవిని పిలిచి ఇరికించే బదులు, సినిమా ఇండస్ట్రీ పెద్దలను పిలిచి మాట్లాడాలని డిమాండ్ చేశారు. టాక్స్ కట్టకపోవడం క్రైమ్ అని… మనం కరెక్ట్ గా ఉండి ప్రభుత్వాన్ని కరెక్టుగా ఉండాలి కోరుదామని వెల్లడించారు. టిక్కెట్ రేట్ల కోసం ఆందోళన ఎక్కడా చేయడం లేదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version