ఆ కానిస్టేబులే నా హీరో: సీపీ అంజనీకుమార్…!

-

చిక్కడ్‌పల్లి పోలీస్‌ కానిస్టేబుల్‌ వీరేందర్‌ పై ప్రశంసల జల్లు కురిపించారు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్. వరద నీటిలో చిక్కుకుపోయిన 25 మందిని ఆయన కాపాడారు నా హీరో వీరేందర్ అంటూ ట్విట్ చేశారు. ఇలాంటి ఆఫీసర్లే మా టీంలో ఉన్న నిజమైన స్టార్లు అన్నారు. వీరేందర్‌ వరద సమయంలో అరవింద్‌ నగర్‌, దోమలగూడ లో చాలామందిని ప్రాణాలకు తెగించి వరద నుంచి కాపాడారు.

సీపీ అంజనీకుమార్‌ ఇంట్లోకి వరద నీరు చేరినట్లు తెలుస్తుంది. నాలుగు రోజులుగా ఆయన ఆఫీసులోనే ఉంటూ డ్యూటీ చేస్తున్నారు. దాదాపు 300 మంది పోలీసు అధికారుల ఇళ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు తమ కుటుంబాలు వరద నీటిలో చిక్కుకున్నప్పటికీ పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version