కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఏపీ రాజకీయాల్లో బీజేపీ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. 2019 ఎన్నికల్లో ఎప్పుడైతే చంద్రబాబు ఓడిపోయి జగన్ అధికారంలోకి వచ్చారో అప్పటినుంచి బిజేపి హడావిడి మొదలైంది. అంతకముందు వరకు బిజేపిని చంద్రబాబు ఎదగనివ్వలేదని ఆ పార్టీ నేతలు బాగా ఫీల్ అయ్యారు..కానీ 2019 ఎన్నికల తర్వాత మంచి ఛాన్స్ వచ్చిందని భావించారు. మొదట్లో టిడిపికి చెందిన పలువురు నేతలని పార్టీలో చేర్చుకుని ఓ రేంజ్‌లో రచ్చ చేశారు.
2019 ఎన్నికల తర్వాత కొంచెం కూడా బిజేపి పుంజుకోలేదు. జనసేనతో పొత్తు పెట్టుకున్న కూడా ప్రయోజనం లేదు. పైగా బిజేపి వల్ల జనసేనకే పెద్ద బొక్క పడింది. అందుకే జనసేన కూడా బిజేపికు దూరం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇక ఇప్పటివరకు తాము ఎదగకపోవడానికి కారణం చంద్రబాబు అనే భ్రమల్లో ఉండిపోయారు. కానీ రాను రాను ఆ భ్రమలు తొలగిపోయాయి. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా రాష్ట్రాన్ని ఏ మాత్రం ఆదుకోని బిజేపికి ఏపీ ప్రజలు మద్ధతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. అందుకే ప్రజలు బిజేపి వైపు మొగ్గు చూపడం లేదు. రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న సోము వీర్రాజు…బిజేపిని ఏ మాత్రం పైకి తీసుకురాలేకపోయారు. పైగా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని విమర్శలు కొనితెచ్చుకున్నారు.
ఏదో కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల ఆ పార్టీలో నాయకులు కనిపిస్తున్నారు గానీ, లేదంటే ఎప్పుడో జెండా పీకేసేవారు. 2019 ఎన్నికల్లో బిజేపికి 1 శాతం ఓట్లు కూడా పడలేదు. ఇప్పటికీ రాష్ట్రంలో బిజేపి పరిస్తితి అదే అని తెలుస్తోంది. నెక్స్ట్ ఎన్నికల్లో బిజేపిది అదే పరిస్తితి అని చెప్పొచ్చు.