కేంద్రంలోని బీజేపీ సర్కారుపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బుధవారం అసెంబ్లీలో కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయంపై జరిగిన చర్చలో మాట్లాడుతూ..కేంద్రం తాము నిధులు ఇచ్చాం.. ఇచ్చాం అని అనడం సరికాదని అన్నారు. రాష్ట్రాలు ఇవ్వకపోతే.. కేంద్రానికి నిధులు ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు.
కేంద్రం జీఎస్టీ తెచ్చి రాష్ట్రాలను యాచకులుగా మార్చిందని మండిపడ్డారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజల సొమ్ముకు ధర్మకర్తలు మాత్రమే ఆయన అన్నారు. కేంద్రం అనేది మిథ్య.. అని ఆనాడు ఎన్టీఆర్ అందుకే అన్నారని ఎమ్మెల్యే కునంనేని గుర్తు చేశారు. దేశానికి నేడు రాజనీతిజ్ఞుల కొరత ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 2014 నుంచి దేశంలో కక్ష సాధింపు రాజకీయాలు ఎక్కువ అయ్యాయని దక్షిణ భారత రాష్ట్రాలు విడిపోవాలి అనే డిమాండ్లు వచ్చేలా పరిస్థితి తయారైందని అన్నారు. ఈ పరిస్థితులు దేశాని మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.