అందుకే నా కూతురికి 7 యేళ్లు దూరంగా వున్నా : రాంగోపాల్ వర్మ..!!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకొని కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్గా నిలిచిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఏ విషయంపైనా సరే ఆయన వివాదాస్పదంగా స్పందిస్తూ తరచూ కాంట్రవర్సీ లతో ఇండస్ట్రీని షేక్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా భార్య, బంధం, కుటుంబం అన్ని భారంగా భావించి రాంగోపాల్ వర్మ చాలా సంవత్సరాల నుంచి తన కుటుంబానికి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల తన కూతురికి ఏడు సంవత్సరాల పాటు దూరంగా ఉండటానికి గల కారణాన్ని కూడా ఒక ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.ఇక వర్మ వ్యక్తిగత విషయానికొస్తే వివాహమైన కొద్ది రోజులకే పాప జన్మించిన తర్వాత తన భార్యకు వర్మ విడాకులు ఇచ్చారు. కుటుంబంతో కలిసి ఉండలేను అని భార్య అంటే బాధ్యత అని.. అలాంటి బాధ్యత తనకు అవసరం లేదు అని.. తన భార్యకు విడాకులు ఇచ్చి వర్మ ప్రస్తుతం సింగిల్గానే ఉంటున్నారు. వర్మ తన భార్యకు విడాకులిచ్చే సమయానికి తన కూతురికి ఏడు సంవత్సరాల వయసు. కుటుంబం కన్నా సినిమా అంటేనే చాలా ఇష్టం అని అందుకే కన్న కూతుర్ని కూడా చూడడానికి వెళ్ళలేదు అని వర్మ బాంబు పేల్చారు.సినిమాలాగే జీవితం కూడా ఒక ఇల్యూషన్ అని.. అందులో తాను నటించే లేక పోయాను అని వర్మ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు. ఇక నిజజీవితంలో నటించలేను కాబట్టి భార్యకు విడాకులు ఇచ్చాను. ఇక విడాకులు ఇచ్చిన తర్వాత సుమారుగా ఏడు సంవత్సరాలపాటు నా కూతుర్ని చూడలేదు. తన 14 సంవత్సరాల వయసులో నా కూతురు నన్ను చూసినప్పుడు నేను తనతో ఇలా అన్నాను . నా గురించి నీకు చెడ్డ గా చెప్పిన విషయాల కంటే నేను ఇంకా చెడ్డవాడిని . నాతో నువ్వు కలిసి ఉండలేవు అని చెప్పాను. కానీ నా కూతురు వివాహ సమయానికి.. నీకు నచ్చినవాడిని వివాహం చేసుకోమని చెప్పాను. కూతురు , అల్లుడు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారా అని వర్మ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version