ఉచ్చం, నీచం, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని.. నడ్డాపై పేర్ని నాని ఫైర్ అయ్యారు. నిన్న ఏపీలో పర్యటించిన జేపీ నడ్డా..జగన్ సర్కార్‌పై విమర్శలు చేశారు. దానికి కౌంటర్ గా పేర్ని నాని ఫైర్ అయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్రానికి వచ్చి విమర్శలు చేస్తున్నారని.. ఢిల్లీ నుంచి చాలా అబద్ధాలు పోగేసుకుని వచ్చారని ఆగ్రహించారు. మా రాష్ట్రం శృతి మించి అప్పులు చేస్తుంటే మీ ఆర్ధిక మంత్రి ఏం చేస్తున్నారు?? అంతే అసమర్ధంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారా?? నోరు ఉంది కదా అని మాట్లాడేస్తారా? అని నిలదీశారు.
80 లక్షల కోట్లు అప్పు మీ కమలం ప్రభుత్వం చేసిందని.. మసీదులను కూలదోయటం, శవాల మీద బుల్డోజర్లు పోనివ్వటం మినహా మీరు చేస్తున్నది ఏంటి అని నిలదీశారు. 130 లక్షల కోట్లకు దేశ అప్పు ను తీసుకుని వెళ్ళింది ఎవరు!? దేశంలో లా అండ్ ఆర్డర్ లేకుండా చేస్తున్నది ఎవరు?? అని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో గత మూడేళ్లుగా మతచిచ్చు రేపే ప్రయత్నం చేయకుండా ఒక్క రోజైనా ఉన్నారా?? రాజమండ్రి వేదికగా పోలవరం గురించి ఒక్క మాట మాట్లాడారా?? అని నిప్పులు చెరిగారు. పోలవరానికి బిల్లులు ఇస్తున్నారా?? అడ్డం గా ఉంటే సరిపోదు… నిజాయితీగా మాట్లాడాలని పేర్కొన్నారు.