ఆ వ్యక్తి డీమాట్‌ అకౌంట్‌లోకి ఏకంగా రూ.11 కోట్లకు పైనే డబ్బు జమా..!

-

డీమ్యాట్‌ అకౌంట్‌ ఎందుకు ఓపెన్‌ చేస్తారో మనందరికీ తెలుసు..అలాంటి ఓ అకౌంట్‌లోకి భారీగా నగదు జమ అయింది. ఈ మధ్య ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతూనే ఉన్నాయి. బ్యాంకులు పొరపాటున నగదు వేయడం మళ్లీ ఆ పారపాటున గ్రహించి వెనక్కి తీసుకోవడం.. మధ్యలో ఆ డబ్బు పడిన కష్టమర్‌ మాత్రం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవడం. తాజాగా జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ (Ahmedabad)లో ఓ వ్యక్తి అకౌంట్లోకి బ్యాంకింగ్‌ సిస్టమ్‌లో జరిగిన పొరపాటు వల్ల రూ.11,677 కోట్లు డిపాజిట్‌ అయ్యాయి. అయితే తన అకౌంట్‌లోకి అంత డబ్బు ఎలా వచ్చింది అనే ఆశ్చర్యం, ఆనందం అతనికి కొన్ని గంటలే మిగిలాయి. పొరపాటును గుర్తించిన బ్యాంక్‌, డిపాజిట్‌ చేసిన డబ్బును వెనక్కి తీసుకుంది. దీంతో ఆ వ్యక్తి ఒక్కరోజు కోటీశ్వరుడిగా మారారని స్థానికులకు ఆనందంగా చెబుతున్నాడు.

బ్యాకింగ్‌ సిస్టమ్‌లో ఇలాంటి పొరపాట్లు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. కొన్నిసార్లు చాలా రోజుల వరకు బ్యాంకులు తప్పులను గుర్తించలేవు.. బ్యాంక్‌ అకౌంట్‌లో అనుకోకుండా డిపాజిట్‌ అయిన డబ్బును వినియోగదారులు విత్‌డ్రా చేసుకుని ఖర్చు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఈ మధ్య ఒ మహిళ అకౌంట్‌లో కోట్లకు కోట్లు డబ్బు జమ అయితే ఆమె ఆ డబ్బుంతా ఖర్చుపెట్టేసింది. ఎప్పటికో తప్పు గుర్తించిన బ్యాంకు ఆ డబ్బు కోసం కోర్టును ఆశ్రయించింది.. తాజాగా ఇలాంటి పొరపాటు అహ్మదాబాద్‌లో పునరావృతం అయింది. బ్యాంకింగ్‌లో జరిగిన ఒక పొరపాటుతో సాగర్ రమేష్ అనే వ్యక్తి ఒకరోజులో కోటీశ్వరుడు అయ్యాడు.

రమేష్ సాగర్ ఆరేళ్లుగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఏడాది క్రితం కోటక్ సెక్యూరిటీస్‌లో డీమ్యాట్ అకౌంట్‌ ఓపెన్‌ చేశాడు. నెల రోజుల క్రితం సాగర్‌ తన డీమ్యాట్‌ అకౌంట్‌ చెక్ చేసుకోగా ఏకంగా రూ.116,77,24,43,277.10 కోట్లు ఉన్నట్లు కనిపించింది. దీంతో అతడు ఆశ్చర్యపోయాడు. అతని అకౌంట్‌లో ఆ మొత్తం ఎనిమిది గంటలకు పైగానే ఉంది. అదేంటో వాళ్ల వీళ్ల అకౌంట్‌లో పడటమే కానీ..మన అకౌంట్లోఎప్పుడూ పడవు అనుకుంటున్నారా..! పడినా మాత్రం ఏం ఉపయోగం లేండి.. మళ్లీ మొత్తం తీసేసుకుంటారుగా..!

Read more RELATED
Recommended to you

Exit mobile version