ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధికార పార్టీ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. వైఎస్ ఆర్ సీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణ రెడ్డి ప్రకటించారు. కర్నులు నుంచి ఇషాక్ బాషా, శ్రీకాకుళం నుంచి పాల వలస విక్రాంత్ తో పాటు కడప నుంచి మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవింద రెడ్డి పేర్ల ను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణ రెడ్డి ప్రకటించాడు.
అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో వైఎస్ ఆర్ సీపీ అభ్యర్థులో గెలిచే అవకాశాలు ఎక్కువ గా ఉన్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటీఫికేషన్ ఇప్పటి కే విడుదల అయింది. 23 నుంచి నామినేషన్ల స్వీకరణ కు చివరి తేది గా ఉంటుంది. నవంబర్ 26 న నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేది గా ఉంటుంది. అలాగే డిసెంబర్ 10 ఎన్నికలు ఉంటాయి. డిసెంబర్ 14 కౌంటింగ్ ఉంటుంది.