100 రూపాయల కోసం కత్తితో పొడిచి చంపేసిన దంపతులు…!

-

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. 100 రూపాయల కోసం ఒక వ్యక్తిని దంపతులు కత్తితో పొడిచి అత్యంత దారుణంగా చంపేశారు. 40 ఏళ్ల వ్యక్తిని పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు రేష్మాను అరెస్టు చేయగా, ఆమె భర్త జితేందర్ పరారీలో ఉన్నాడు. మృతుడిని మంగోల్‌పురి నివాసి అజీత్‌గా గుర్తించినట్లు పోలీసులు మీడియాకు వివరించారు.

ఆదివారం మధ్యాహ్నం 2:45 గంటలకు ఈ సంఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందింది. ప్రాథమిక దర్యాప్తులో జితేందర్ ఆదివారం రూ .100 తిరిగి చెల్లించాలని అజీత్‌ను కోరగా… అజిత్ మాత్రం ఇవ్వలేదు. ఇద్దరి మధ్య గొడవ తీవ్ర స్థాయిలో జరిగింది. ఈ క్రమంలో జితేందర్ అజిత్ పై దాడికి దిగాడు. జితేందర్ తన ఇంటికి వెళ్లి, కత్తిని తీసుకువచ్చి భార్యతో కలిసి అజిత్ ని పొడిచి చంపాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version