రంగుల ప్రపంచంలో బతుకుతున్న మనం ఒక్కసారి రంగులు మాయమైతే.. అసలు ఊహించగలమా? మరి అంతలా మనలో భాగమైన రంగులు ఎన్నున్నాయి. వాటి ప్రత్యేకతేంటని ఎప్పుడైనా ఆలోచించారా? కనీసం తెలుసుకోవడానికి ప్రయత్నించారా? వాటి పూర్తి వివరాలు తెలుసుకోండి.
పింక్ : ఆడపిల్లలకు చాలా ఇష్టమైన రంగు. పింక్ రంగుకు ఆందోళన, ఒత్తిడి స్థాయిలను తగ్గించే శక్తి ఉంది. ఎవరి మీదైనా కోపంగా ఉన్నప్పుడో లేదా కోపాన్ని అనుచుకోలేక గోడవ పడే స్థాయికి వెళ్లినప్పుడు పింక్ కలర్‌ని చూసి మీ మూడ్‌ను మార్చుకోవచ్చు.
ఆరెంజ్ : ఎగ్జామ్‌కు, ఇంటర్వూకి వెళ్తున్నారా.. నెర్వస్ ఫీల్ అవుతున్నారా.. అయితే కచ్ఛితంగా ఆరెంజ్ రంగు హెల్ప్ చేస్తుంది. ఈ రంగు మెదడును షార్ప్‌గా ఉంచుతుంది. డిస్ట్రబ్ మూడ్‌లో ఉన్నవారికి ఆరెంజ్ రంగు మూడ్‌ను మారుస్తుంది.
గ్రీన్ కలర్ : ఆఫీస్ పనితో ఒత్తిడికి లోనయ్యారా.. పని సాఫీగా చేయలేకపోతున్నారా.. అయితే చుట్టుపక్కల ఆకుపచ్చ రంగు ఉండేలా చూసుకోండి. పచ్చని ఆకృతిని చూడగానే మనసు పరవశంతో ఉప్పోంగిపోతుంది. మైండ్‌లో ఉన్న టెన్షన్ ఎగిరిపోతుంది.
తెలుపు : శాంతికి చిహ్నం తెలుపు రంగు. వేసవిలో ఎక్కువగా ఉపయోగిస్తాం. ఎండ వేడిమి నుంచి ఈ రంగు కాపాడుతుంది. అంతేకాదు మనసును ప్రశాంతంగా ఉంచడంలో కూడా సాయపడుతుంది.
నలుపు : ఈ రంగు అశుభంగా బావిస్తారు. కానీ నలుపు పట్టుదలను, ఏదన్నా సాధించాలనే కాన్ఫిడెన్స్ లెవెల్స్‌ను పెంచుతుంది. ఈ రంగు ఫ్యాషన్‌లో రారాజు అని చెప్పవచ్చు.
నీలం : బ్లూకి ఆకలిని తగ్గించే శక్తి ఉంది. నీలం రంగును చూడగానే మెదడు విడుదల చేసే కొన్ని రసాయనాలే దీనికి కారణం. కాబట్టి బరువు పెరుగిపోతున్నాం అని బాధపడేవాళ్లు డైనింగ్ హాలును బ్లూ రంగుతో మార్చేయండి.
పసుపు : మెదడు సెరటోనిన్ అనే కెమికల్‌ను విడుదల చేయడంలో సహాయపడుతుంది. ఇది నాడీవ్యవస్థను మేల్కోలుపుతుంది. అనేక సంస్థలు వినియోగదారులను ఆకర్షించేందుకు పసుపు రంగును ఉపయోగిస్తారు.
ఎరుపు : అ రంగు అత్యంత శక్తివంతమైనది. అడ్రినల్ గ్రంథి, న్యూరాన్స్‌ను ప్రేరేపిస్తుంది. మీ రెగులర్ యాక్టివిటీస్‌ను ప్రభావితం చేస్తుంది. దీన్నేనా సమర్థంగా ఎదుర్కొనే చేస్తుంది.