బిగ్ బాస్ లైవ్: బిగ్ బాస్ కంటెస్టెంట్ లు వీరే…

-

బిగ్ బాస్ లో మొదటి కంటెస్టెంట్… బ్రదర్ ఆఫ్ బొమ్మాళి సినిమాలో హీరోయిన్ గా నటించిన మోనాల్ గజ్జర్ వచ్చింది. ఆమె తెలుగులో 5 సినిమాలు చేయగా… ఆమె సొంత రాష్ట్రం గుజరాత్, 15 ఏళ్ళ వయసులో తండ్రిని కోల్పోయింది.

బిగ్ బాస్ లో రెండో కంటెస్టెంట్సూర్య కిరణ్… సినిమా రచయిత మరియు దర్శకుడు. 2003 లో అక్కినేని నాగార్జున నిర్మించిన సత్యం చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత బ్రహ్మస్త్రాం, 6 వ అధ్యాయం, ఆచుకి సినిమాలకు ఆయన దర్శకత్వం వహించాడు. సూర్య కిరణ్ నటి కావేరిని వివాహం చేసుకున్నారు.

బిగ్ బాస్ లో మూడో కంటెస్టెంట్: యాంకర్ లాస్య… ఆమె పలు చానల్స్ లో యాంకర్ గా పని చేసారు. రెండేళ్ళ క్రితం వివాహం చేసుకున్న ఆమెకు ఒక బాబు ఉన్నాడు. మా టీవీ లాంటి ప్రముఖ టీవీ చానల్స్ లో ఆమె పని చేసారు.

బిగ్ బాస్ లో నాలుగో కంటెస్టెంట్: నటుడు అభిజిత్… లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఒక హీరోగా చేసాడు. ఆ తర్వాత పెళ్లి గోల అనే ఒక వెబ్ సీరీస్ లో నటించాడు. ఇప్పుడు కొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు.

బిగ్ బాస్ లో ఐదో కంటెస్టెంట్ : జోర్దార్ సుజాత, హెచ్ ఎం టీవీలో వచ్చే ‘జోర్దార్’ న్యూస్ ద్వారా ఈమె పాపులర్ అయింది. తెలంగాణా యాసలో వార్తలు చెప్పడంలో తనకంటూ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ ఏర్పరచుకుంది.

బిగ్ బాస్ లో ఆరో కంటెస్టెంట్ : మెహబూబ్ దిల్ సే, ఈయనకి ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకున్నా, కేవలం టిక్ టాక్, యూట్యూబ్ వీడియోస్ తో జనానికి దగ్గరయ్యాడు. సోషల్ మీడియాలో మనోడు చాలా పాపులర్.

బిగ్ బాస్ లో ఏడో కంటెస్టెంట్ : దేవీ నాగవల్లి, టీవీ 9లో ఈమె న్యూస్ ప్రేజెంటర్, ఈమె గురించి ప్రత్యేక పరిచయాలు ఏమీ అక్కర్లేదు అనుకుంటా.

బిగ్ బాస్ లో ఎనిమిదో కంటెస్టెంట్ : దేత్తడి హారిక, యూట్యూబ్ లో దేత్తడి హారిక అనే ఛానెల్ ద్వారా ఆమె పాపులర్ అయింది. ఒకరకంగా ఈమె ఒక పాపులర్ తెలంగాణా యూట్యూబర్ అని చెప్పచ్చు.

బిగ్ బాస్ లో తొమ్మిదో కంటెస్టెంట్ : నటుడు సోహైల్, కొత్త బంగారులోకం అనే సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఈయన, తెలుగు వాళ్ళకి పెద్దగా పరిచయం అయితే లేదు. స్టార్ మాలో ఒక సీరియల్ లో ఈయన నటిస్తున్నాడు.

బిగ్ బాస్ లో పదవ కంటెస్టెంట్ : యాంకర్ అరియానా గ్లోరీ, పలు యూట్యూబ్ ఛానెల్స్ లో యాంకర్ గా చేసిన ఈమె పెద్దగా పరిచయం అయితే లేదు కానీ వర్మ లాంటి వాళ్ళు కొన్ని ఇంటర్వ్యూలలో ఈమెతో ఫ్లర్ట్ చేయడంతో ఈమె వెలుగులోకి వచ్చింది.

బిగ్ బాస్ లో పదకొండవ కంటెస్టెంట్ : కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అమ్మ రాజశేఖర్, ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కి కొరియోగ్రాఫర్ గా చేసిన ఈయన తర్వాతి కాలంలో దర్శకుడిగా మారాడు.

బిగ్ బాస్ లో పన్నెండవ కంటెస్టెంట్ నటి కరాటే కళ్యాణి, ఈమె నటిగా సుపరిచితం. బాబీ, మిరపకాయ్ లాంటి సినిమాల్లో ఈమె చేసిన బోల్డ్ క్యారెక్టర్ లు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

బిగ్ బాస్ లో పదమూడో కంటెస్టెంట్ : నటుడు, ర్యాప్ సింగర్ నోయల్ , సింగర్ గా ర్యాప్ సాంగ్స్ పాడే ఈయన నటుడిగా కూడా చాలా సినిమాల్లో కనిపించాడు.

బిగ్ బాస్ లో పద్నాలుగో కంటెస్టెంట్ : నటి దివి , పలు యూట్యూబ్ వెబ్ సిరీస్ లో ఈమె నటిగా కనిపించానని చెబుతోంది కానీ, ఎవరనేది గుర్తు పట్టే పరిస్థితి లేదు.

బిగ్ బాస్ లో పదిహేనో కంటెస్టెంట్ : అఖిల్ సార్థక్, మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఆఫ్ హైదరాబాద్ అవార్డ్ వచ్చిందంటున్న ఈయన కూడా మన వాళ్ళకి కొత్త అనే చెప్పాలి.

బిగ్ బాస్ లో పదహారవ కంటెస్టెంట్ : యూట్యూబ్ సెన్సేషన్ గంగవ్వ, యూట్యూబ్ లో మై విలేజ్ షో అనే ఒక చానల్ తో పాపులారిటీ సంపాదించిన ఈమె పలు సినిమాల్లో కూడా నటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version