కేంద్రంపై టీఆర్ఎస్ పోరు..నేడు నల్ల జెండాలు ఎగురవేత

-

ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రం, టీఆర్‌ఎస్‌ ల మధ్య వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఉగాది మరుసటి రోజు నుంచి.. కేంద్రంపై పోరు పేరుతో నిరసన కార్యక్రమాలు చేస్తోంది టీఆర్‌ఎస్‌ పార్టీ. ఇందులో భాగంగానే నేడు ప్రతి ఇంటిపైనే నల్లా జెండాను ఎగురవేయాలని టీఆర్‌ఎస్‌ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఇప్పటికే అన్ని గ్రామాల్లో నల్లా జెండాలను పంపిణీ చేసింది టీఆర్ఎస్‌ పార్టీ.

ఈ కార్యక్రమం ఉదయం 11 గంటల సమయంలో చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో ధరలు పెరుగుతుంటే మోడీ ఆనాడు ట్విట్ పెట్టారు,రోడ్లు ఎక్కి ఆందోళన చేశారని.. మన్మోహన్ సింగ్ చాతనవడం లేదు దిగి పొమ్మని మోడీ మాట్లాడారని గుర్తు చేశారు.

ప్రశ్నిస్తే దేశ ద్రోహివి అంటూ నోటికొచ్చే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని.. రష్యా యుద్ధం పేరు చెప్పి ఆయిల్ ధరలను పెంచుతున్నారని ఆగ్రహించారు. నేడు తెలంగాణలో ఉన్న ప్రతి రైతు ఇంటి మీద నల్ల జెండా ఎగరాలి… ప్రతి ఊర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనము చేయాలేన్నారు. 11 వ తారీఖున ఢిల్లీలో నరేంద్ర మోడీ ఇంటి దగ్గర ధర్నా చేయబోతున్నామని స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version