బ్లడ్‌గ్రూప్‌ను బట్టి ఆహారపదార్థాలు తీసుకుంటే రోగాలు రావు..!

-

ఆధునిక కాలంలో చేస్తున్న ఉద్యోగానికి తగ్గినట్లుగా ఆహార అలవాట్లను మార్చుకుంటున్నారు. సమయం సందర్భం లేకుండా ఎప్పుడుబడితే అప్పుడు, ఏది దొరికితే అది తింటూ ఆనారోగ్యానికి గురవుతున్నారు. సరైన సమయానికి తగిన ఆహారం తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదని ఒక్కోక్కరికి శరీరానికి తగినట్లుగా వారి ఆహారపు అలవాట్లు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

సరైన సమయానికి, తగిన ఆహారం తీసుకోవడం. శరీరానికి పడే ఆహారం తినడం ఇవన్నీ ఒకెత్తయితే మనిషి శరీరంలో ఉండే రక్తం గ్రూపును బట్టి ఆహారాన్ని తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక రక్తంలోనూ వివిద రకాల గ్రూపులు ఉన్నాయి. కొందరి బ్లడ్ గ్రూపులు అరుదుగా దొరికతే, కొందరివి సాధారణ బ్లడ్ గ్రూప్‌లు అయి ఉంటాయి. రక్తంలో ఉండే గ్రూపును బట్టి వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో సూచిస్తున్నారు. ఓసారి వాటిపై ఓ లుక్కేద్దాం..


1. A బ్లడ్‌గ్రూప్ ఉన్నవారు చాలా బలహీనంగా ఉంటారు. దాంతోపాటు వ్యాధి నిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు నిమ్మజాతికి చెందిన పండ్లను ఎక్కువగా తినాలి. A గ్రూప్‌వారు నాన్‌వెజ్‌కు దూరంగా ఉండడం మంచిది. బరువు తగ్గాలంటే పండ్లు, ఆకుకూరలు, బీన్స్, గింజలు. చిరుధాన్యాలు, చేపలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడంతోపాటు వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

2. B గ్రూప్ రక్తం ఉన్నవారు ఆకుకూరలు, గుడ్లు, తక్కువ కొలెస్ట్రాల్ ఉండే ఆహారపదర్థాలు తీసుకోవాలి. కార్న్, టమాటాలు, గింజలు, నువ్వులు తక్కువ మోతాదులో తీసుకోవాలి. వీరికి సహజంగా జీవక్రియ తక్కువగా ఉంటుంది. త్వరగా అలసిపోతారు. ఆహారం తీసుకున్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుదల కనిపిస్తుంది. కాబట్టి సమయానికి భోజనం చేయాలి. వీరి శరీరంలో కార్డిసాల్ హార్మోన్లు విడుదలవుతుంటాయి. ఫలితంగా వీరు ఎక్కువ ఒత్తిడికి గురవుతుంటారు. ఇలాంటి వారు కొవ్వు, నూనె పదార్థాలు, ఆల్కాహాల్ తీసుకోకపోవడం మంచిది.

3. AB గ్రూప్. వీరి జీర్ణావయంలో ఆమ్లరసాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆమ్ల గుణాలున్న పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇఆంటి బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి యాపిల్ సైడర్ వెనిగర్, మునగ, తేనెను ఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలు, చేపలు, పాలు వంటివి ఆహారంతో పాటు చేర్చుకోవాలి.

4. o గ్రూప్. వీరికి సహజంగానే జీర్ణాశయ సంబంధ సమస్యలు ఎదురవుతాయి. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను తీసుకుంటే మంచిది. వీటిలో చేపలు, మాంసం, కూరగాయలు, గింజలు, బీన్స్, ఆకుకూరలు క్రమం తప్పకుండా తీసుకోవాలి.
చదివారుగా ఆహార విషయంలో వీటిని పాటిస్తే చాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version