లిఫ్ట్‌లో ఇరుకున్న బాలుడు.. విషమంగా ఆరోగ్యం : నిలోఫర్ డాక్టర్లు

-

మాసబ్‌ట్యాంక్‌‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఆరేళ్ల బాలుడు లిఫ్ట్‌‌లో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం లిఫ్ట్‌లో వెళ్తున్న టైంలో ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో భయానికి గురైన బాలుడు ఏడుస్తూ కేకలు వేశాడు.గమనించిన అపార్ట్‌మెంట్‌ వాసులు వెంటనే అగ్నిమాపక,డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి సమాచారం అందించారు.

ఘటనా స్థలికి చేరుకున్న సిబ్బంది వెల్డింగ్ కట్టర్ సాయంతో లిఫ్ట్‌ డోర్‌లు తొలగించి బాలుడిని బయటకు తీసుకొచ్చి అనంతరం నిలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా, బాలుడి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. శరీర లోపలి భాగాలు పూర్తిగా నలిగిపోయి దెబ్బతిన్నాయన్నారు. లిఫ్ట్‌లో రెండు గంటల పాటు బాలుడు అవస్థ పడినట్లు తెలిపారు. ఆక్సిజన్ అందక, రక్తప్రసరణ ఆగిపోయిందని వివరించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు సూపరింటెండెంట్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news