సంగారెడ్డిలో గురుకుల విద్యార్థులతో టిఫిన్స్ తయారీ..

-

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల పాఠశాలలపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటివరకు ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగుచూడగా.. తాజాగా విద్యార్థులతో ఉదయం టిఫిన్స్ చేయిస్తున్న ఘటన వెలుగుచూసింది.

6

ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల వసతి గృహంలో శనివారం ఉదయం వెలుగుచూసింది.విద్యార్థులతో టిఫిన్లు చేయిస్తూ గురుకుల సిబ్బంది వెట్టి చాకిరి చేయిస్తున్నట్లు సమాచారం.ఈ విషయంలో వివరణ కోరగా అల్పహారంలో బోండాలు, పూరీల తయారీలో విద్యార్థుల సహాయం తీసుకుంటామని బాహాటంగానే ప్రిన్సిపాల్ విజయ్ చెప్పినట్లు తెలిసింది. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news