పందెం కోసం ప్రేయసి ప్రాణాలను గాల్లో కలిపేసిన ప్రియుడు..!

-

అతడు ఒక్క యూ ట్యూబ్ స్టార్. వీడియోలు చేయడంలో తనకి తానే సాటి. ఆస్తికరమైన వీడియోలను యూట్యూబ్‌లో పెడుతూ అందరిలోనూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు. అతనికి ఓ ప్రేయసి కూడా ఉంది. ప్రస్తుతం ఆమె గర్భవతి. రోజూలాగే ఆ యూట్యూబర్.. లైవ్ ఆన్ చేశాడు. నెటిజన్లను పలకరించాడు. ఆ సందర్భంగా ఓ ప్రేక్షకుడు యూట్యూబర్‌కు ఛాలెంజ్ విసిరాడు. తాను చెప్పిన పని చేస్తే 1300 డాలర్లు ఇస్తానంటూ సవాల్ విసిరాడు. అయితే ఆ ఛాలెంజ్ అతని ప్రేయసి ప్రాణాలను తీయడమే కాకుండా.. అతడిని ఊచలు లెక్కబెట్టించింది.

youtuber

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రష్యాకు చెందిన యూట్యూబర్ స్టాస్ రీప్లే. అతనికి ప్రేయసి వాలంటీనా గ్రిగర్‌యేవా ఉంది. వీరిద్దరూ యూట్యూబ్‌లో అప్పుడప్పుడూ వీడియోలు పెట్టడంతో పాటు, లైవ్‌లో వీక్షకులకు పలకరిస్తుంటారు. ఈక్రమంలోనే తన ప్రేయసితో కలిసి యూట్యూబ్ లైవ్‌లోకి వచ్చాడు స్టాస్ రీప్లే. ఇద్దరూ కలిసి నెటిజన్లను పలకరించారు. అంతా బాగానే ఉన్న సమయంలో ఓ వీక్షకుడు స్టాస్ రీప్లేకి ఒక సవాల్ విసిరాడు. తన ప్రేయసిని శరీరంపై దస్తులు లేకుండా కొంత సమయం పాటు గది బయట నిల్చోబెట్టాలని ఛాలెంజ్ చేశాడు. అలా చేస్తే 1300 డాలర్లు ఇస్తానని పందెం కాశాడు.

అయితే దానికి టెంప్ట్ అయిన స్టాస్ రీప్లే.. తన ప్రేయసిని బలవంతంగా బాల్కానీలోకి నెట్టి లోపలి నుండి గడియ పెట్టుకున్నాడు. ఇక బయట గడ్డకట్టేంత చలి.. శరీరంపై బికినీ తప్ప ఎలాంటి దుస్తులు లేవు. దీంతో వాలంటీనా తీవ్రమైన చలికి అల్లాడిపోయింది. గది తలుపులు తెరవాలని ప్రియుడిని వేడుకుంది. అయినా అతను పట్టించుకోకపోవడంతో 15 నిమిషాల పాటు నరకం అనుభవించిన వాలంటీనా బాల్కనీలో కుప్పకూలిపోయింది. కొద్దిసేపటి తరువాత స్టాస్ రీప్లే గది తలుపులు తెరిచి చూడగా వాలంటీనా కింద పడిపోయి ఉండటాన్ని గనించాడు. ఆమెను పరీక్షించగా అప్పటికే ప్రాణాలు విడిచింది. ఇక్కడ మరో విషాదం ఏంటంటే.. వాలంటీనా ఆ సమయంలో గర్భవతి. కాగా, స్టాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు

Read more RELATED
Recommended to you

Exit mobile version