ఏపీ ప్రభుత్వాన్ని ఎండగట్టిన కాగ్…!

-

ఆర్థిక సంక్షోభం దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తుందని కాగ్ తెలిపింది. రాష్ట్రం 10 నెలలకు తీసుకొన్న రుణం రూ.73 వేల 913 కోట్లు అని తన లెక్కల్లో కాగ్ వెల్లడించింది. బడ్జెట్ లో అంచనా రూ.48 వేల 295 కోట్లు కాగా అంచనా కన్నా 153 శాతం ఎక్కువ అని వెల్లడించారు. పెరిగిపోతున్న రెవెన్యూ లోటు, 300 శాతం అధికం అని వెల్లడించింది. బడ్జెట్ లో రెవెన్యూ లోటు అంచనా రూ.18 వేల 434 కోట్లు అని తెలిపింది.

కాని అసలు రెవెన్యూ లోటు రూ.54 వేల 046 కోట్లు అని పేర్కొంది. రెవెన్యూ రాబడి పెరిగినా సంక్షేమ కార్యక్రమాలతో అప్పుల ఊబిలో ఏపీ ఉందని స్పష్టం చేసింది. గతేడాది జనవరి నెలాఖరు వరకు అప్పులు రూ.46 వేల 503 కోట్లుగా కాగ్ వెల్లడించింది. బహిరంగ మార్కెట్ లో రుణాల సేకరణలో ఏపీకి దేశంలో 4వ స్థానం ఉందని… కాగా తన నివేదికలో పేర్కొంది.

డిసెంబర్ లో 30 రోజులు స్పెషల్ డ్రాయింగ్, 26 రోజులు చేబదుళ్లు, 3 రోజులు ఓవర్ డ్రాఫ్ట్ అని, బహిరంగ మార్కెట్లో రుణాలు తీసుకున్నా ఆంధ్రప్రదేశ్ అవసరాలి తీరలేదు అని కాగ్ పేర్కొంది. సంక్షేమ కార్యక్రమాలు ఏపీకి పెద్ద ఇబ్బందని కాగ్ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version