చెట్టును ఢీకొని కారు బోల్తా కొట్టిన ఘటనలో ఓ యువరైతు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని వేల్పూర్ మండలం అమీనాపూర్ శివారులో నిజాం సాగర్ కెనాల్ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. మృతుడు జక్రాన్ పల్లి మండలం అర్గుల్ గ్రామానికి చెందిన యువరైతు అల్లూరి శ్రావణ్ రెడ్డి (32)గా గుర్తించారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు మృతుడితో పాటు కారులో ప్రయాణిస్తున్న అతని భార్య అల్లూరి హారిక రెడ్డి బంధువు దశరథ్ రెడ్డిని కారులో నుంచి బయటకు తీశారు. డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. క్షతగాత్రుడిని 108 అంబులెన్స్ లో ఆర్మూర్ లోని ప్రముఖ ఆశ సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.