కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మంగళవారం రాత్రి సమయంలో రహదారిపై ఓ మహిళ తన పిల్లలతో కలిసి రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో వేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ గాల్లోకి ఎగిరి కిందపడిపోయింది.
ఈ ప్రమాదంలో మహిళ అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. కారు మహిళను ఢీకొట్టిన దృశ్యాలు సీసీటీవీ రికార్డు అయ్యాయి. ఆ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డివైడర్ పైనుంచి రోడ్డు దాటుతున్న మహిళ, ఆమె పిల్లలను కారు ఢీకొట్టగా.పిల్లలకు గాయాలైనట్లు సమాచారం. రహదారిపై లైట్లు సరిగా లేకపోవడంతో చీకటికి సరిగా కనిపించక కారు ఢీకొట్టినట్లు తెలుస్తోంది.ప్రమాదానికి గురైన సమయంలో మహిళ వెంట మరికొందరు రోడ్డు దాటేందుకు ప్రయత్నించి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
హైవేపై రోడ్డు ప్రమాదం.. ఎగిరిపడిన మహిళ
కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గలో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం
డివైడర్ పైనుంచి రోడ్డు దాటుతున్న మహిళ, ఆమె పిల్లలు
చీకటికి సరిగా కనిపించకపోవడంతో కారు ఢీకొట్టడంతో ఎగిరిపడిన మహిళ
మహిళ అక్కడిక్కడే మృతి.. సీసీటీవీ ఫుటేజ్ వైరల్ pic.twitter.com/pt3dxM5nfb
— BIG TV Breaking News (@bigtvtelugu) February 25, 2025