2023 ను తృణ ధ్యానాల సంవత్సరంగా ప్రకటిస్తున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వంట నూనెల కోసం దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తి చేయాలని.. పీపీపీ మోడల్‌లో ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహం ఉంటుందని స్పష్టం చేశారు. రసాయన రహిత వ్యవసాయ అభివృద్ధికి మరింత ప్రోత్సాహం ఉంటుందని.. సేంద్రీయ ప్రకృతి వ్యవసాయానికి ప్రత్యేక ప్రోత్సాహం ఉంటుందని చెప్పారు. చిరు ధాన్యాల అభివృద్ధికి అదనపు ప్రోత్సాహం ఇస్తామన్నారు.
ఎంఎస్ఎంఈలకు మార్కెటింగ్ సహకారం కోసం నూతన పోర్టల్ ఏర్పాటు చేస్తామని.. ఎంఎస్ఎంఈల ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక ప్లాట్‌ఫాం ఉంటుందని ప్రకటన చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల విలువల పెంపు కోసం స్టార్టప్‌లకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. రైతులకు అద్దె ప్రాతిపదికన వ్యవసాయం పనిముట్లు ఇచ్చేందుకు ప్రత్యేక కథనం ఉంటుందని.. పర్వతమాల ప్రాజెక్టులో 8 రోప్‌వేల అభివృద్ధి చేస్తామని ప్రకటన చేశారు. 60 కిలోమీటర్ల దూరంతో ఒక్కో రోప్‌వే నిర్మాణం చేస్తామని…పర్వతమాల ప్రాజెక్టు కింద పర్యావరణ హితమైన అభివృద్ధి చేస్తామన్నారు.