వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చిన అభయహస్తం పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం నీరుగార్చిందని విమర్శించారు. ట్విట్టర్ లో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పొదుపు సంఘాల మహిళలకు వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా ఉండాలని YS రాజశేఖర రెడ్డి గారు చేసిన ఆలోచనల ఫలితమే అభయహస్తం పథకమని.. 2017 వరకు అమలైన పథకంలో మార్పులు తీసుకొస్తామని చెప్పిన కేసీఆర్ సర్కార్ ఐదేండ్లయితున్న ఇప్పటివరకు అమలు చేసింది లేదన్నారు.
అభయ హస్తం పథకాన్ని తిరిగి ప్రారంభించాలి, లేదంటే వడ్డీలో డబ్బులు చెల్లించాలి…. ప్రభుత్వానికి వైఎస్ షర్మిళ డిమాండ్
-