దేశం లో ఉప ఎన్నికల ట్రెండ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే… మరోసారి ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. దేశంలోని 5 రాష్ట్రాలలో ఖాళీగా 5 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానం ఉంది.
యూపీ, ఒడిశా, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లో ఈ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే.. మరోసారి ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నెల 10 నుంచి నామినేషన్‌ల స్వీకరణ ఉంటుందని.. డిసెంబర్ 5న పోలింగ్ ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొంది కేంద్ర ఎన్నికల సంఘం. అలాగే డిసెంబర్ 8 న ఓట్ల లెక్కింపు ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం స్ఫష్టం చేసింది. అటు డిసెంబర్ లోనే గుజరాత్ ఎన్నికలు కూడా జరుగనున్నాయి.