కరోనా వైరస్ సంక్షోభం సమయంలో ఆ సమయంలో దేశ ప్రజలందరికీ ఆర్దిక చేయూత అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం మారటోరియం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ సంక్షోభం తగ్గిపోవడంతో ఈ మారటోరియం ని పొడిగిస్తూ వచ్చింది. కాగా ఇంతకుమించి మారటోరియం పొడిగించి ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయలేము అంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్ర ప్రభుత్వం.
కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య ఎంతో మంది ఆర్థికంగా కుంగిపోయిన నేపథ్యంలో వారిని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మారటోరియం చక్రవడ్డీ లాంటివి రద్దు చేసింది అంటూ సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ఇంతకంటే ఎక్కువగా దేశ ప్రజలకు కరోనా సంక్షోభం సమయంలో ఉపశమనాలు ఇవ్వలేము అంటూ స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం.. మరోసారి మారటోరియం పొడగించలేము అంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో తెలిపింది. ఇక ఇంతకంటే ఎక్కువ ఉపశమనాలు కలిగిస్తే ఆర్థిక వ్యవస్థతో పాటు బ్యాంకింగ్ రంగం కూడా తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక విధానంలో కోర్టుల జోక్యం తగదు అంటూ తెలిపింది.