ఉధృతంగా పొంగిన వాగు.. తాడు సాయంతో రాకపోకలు

-

భారీ వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలం అవుతోంది. దింతో ఓ వాగు ఉధృతంగా పొంగింది. ఈ తరుణంలోనే తాడు సాయంతో రాకపోకలు సాగుతున్నాయి. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో వాగు ఉప్పొంగడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

The combined Adilabad district is in turmoil due to heavy rains
The combined Adilabad district is in turmoil due to heavy rains

వాంకిడి మండల కేంద్రంలో భారీ వర్షాల కారణంగా పొంగి పొర్లుతున్నాయి వాగులు. పిప్పర్ గొంది వాగు ఉధృతంగా ప్రవహించడంతో తాడు సహాయంతో వాగును విద్యార్థులు, గ్రామస్థులు దాటారు.

కాగా ఇవాళ తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి ములుగు కొత్తగూడెం మహబూబాబాద్ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ కేంద్రం రెడ్ జారీ చేయడం జరిగింది.

 

Read more RELATED
Recommended to you

Latest news