భారతదేశంలో కరోనా మరణాల రేటు చాలా తక్కువగా ఉంది అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేస్ ఫాటాలిటీ రేట్ (సిఎఫ్ఆర్) 1.76% వద్ద ఉందని వివరించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యల్పంగా ఉందని చెప్పింది. గ్లోబల్ సిఎఫ్ఆర్ 3.3% వద్ద ఉంది. భారతదేశం లో మిలియన్ కి 48 మరణాలు నమోదు అవుతున్నాయని కేంద్రం పేర్కొంది. ఇది ప్రపంచంలోనే అత్యల్పంగా ఉందని వివరించింది.
ప్రపంచ సగటు చూస్తే చాలా ఎక్కువగా ఉంది. 110 మంది మిలియన్ జనాభాకు మరణిస్తున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అయితే 1.3 బిలియన్ జనాభా ప్రకారం చూస్తే చాలా తక్కువ కేసులు ఉన్నాయి. ప్రతీ రోజు సగటున వెయ్యి మంది వరకు మరణిస్తున్నారు. కరోనా యాక్టివ్ కేసులు 8 లక్షలు దాటాయి.