తిరుమలలో ఒక్కసారిగా తగ్గిన భక్తుల రద్దీ.. ఎందుకంటే?

-

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా తగ్గింది. బుధవారం స్వామి వారి దర్శనం కోసం జనాలు పోటెత్తగా.. గురువారం నిన్నటితో పోలిస్తే తక్కువగా ఉందని టీటీడీ ప్రకటించింది. తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ఏపీలోనూ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భక్తులు తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకుని ఉండొచ్చని ఆలయ అధికారులు భావిస్తున్నారు.

ఇక నిన్న వచ్చిన టోకెన్లు లేని భక్తుల దర్శనానికి దాదాపు 8 గంటలకు పైగా సమయం పడుతుండగా.. రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటలకు పైగానే సమయం పడుతోంది. అదేవిధంగా నేడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 7 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నిన్న స్వామి వారిని 64,447 మంది భక్తులు దర్శించుకోగా.. అందులో 25,555 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.38 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news