కళ్లజోళ్ల కాలం పోయి..కాంటాక్ట్ లెన్స్ కాలం వచ్చింది. ఇబ్బంది ఉన్నా అది కనిపించకూడదు..పైగా అందంగా ఉండాలనే చాలామంది కాంటాక్ట్ లెన్స్‌కు అలవాటు పడ్డారు. ఇవి పెట్టుకునేప్పుడు, తీసేప్పుడు, వాటి శుభ్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే కాంటాక్ట్స్ లెన్స్ అంటే ఒకేసారి ఒక కంట్లో ఒకటే పెట్టుకుంటారు..కానీ ఓ మహిళ కంట్లోంచి ఏకంగా ఒకటి కాదు రెండు కాదు..23 కాంటాక్ట్ లెన్స్‌లను బయటకు తీశారు వైద్యులు. అసలు ఆమె అన్ని ఎందుకు పెట్టుకుందో..! ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.!
కాలిఫోర్నియాకి చెందిన ఒక మహిళకి కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవడం అలవాటు. అలా ప్రతి రోజు వాటిని పెట్టుకుంటూనే ఉంది. కానీ వాటిని తీసేయడమే మర్చిపోయింది. అలా ప్రతి రోజు వాటిని తియ్యకుండానే కొత్త కాంటాక్ట్ లెన్స్ ధరిస్తూ వచ్చింది. ఇలాగే దాదాపు 23 లెన్స్‌లు పెట్టుకుంటూనే ఉంది. అవన్నీ కంటి రెప్ప కింద ఉండిపోయాయి. ఒక రోజు కంట్లో నొప్పి ఎక్కువగా ఉండటంతో డాక్టర్ దగ్గరకి వెళ్ళింది. పరీక్షించిన డాక్టర్ ఆమె కంట్లో 23 లెన్స్‌లు ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు.
ఆ కాంటాక్ట్ లెన్స్‌ల తొలగింపు ప్రక్రియకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోను డాక్టర్ కాథెరిన్కురటీవా అనే డాక్టర్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో సెప్టెంబర్ 13న పోస్ట్ చేశారు. ఆ 23 కాంటాక్ట్ లెన్స్‌లను మహిళ కంటి నుండి తొలగించినట్లు వీడియో క్లియర్‌గా తెలుస్తుంది.
వీడియోలో మహిళ కన్ను కనిపిస్తోంది. అందులో నుంచి ఆ డాక్టర్.. కాంటాక్ట్ లెన్స్‌లను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నట్టుగా కనబడుతోంది. ఇలా మొత్తం మీద 23 కాంటాక్ట్ లెన్స్‌లు బయటకొచ్చాయి. ఇది చూసి ఆ డాక్టరే షాక్అయ్యారు. కంటి నుంచి తొలగించిన ఆ లెన్స్ ఆకుపచ్చ రంగులోకి మారిపోయి అతుక్కుని ఉన్నాయి. సెప్టెంబర్ 13న ఈ వీడియోను అప్లోడ్ చేయగా.. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. ఆ వీడియో చూస్తుంటేనో ఘోరంగా ఉంది.. ఆమెకు అసలు అలా ఎలా మర్చిపోయిందో కదా..!