తొక్కిసలాట ఘటన మృతులకు రూ.25లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

-

తిరుమల శ్రీవారి వైకుంట ద్వార సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. మృతులకు  25లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆనం రాంనారాయణ ప్రకటించారు. తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడలో చోటు చేసుకున్న తొక్కసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం విధితమే.

గాయపడ్డవారిని రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. మరో 48 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో 40 మంది వరకు డిశ్చార్జ్ అయ్యారు. మరో 8 మంది చికిత్స పొందుతున్నారు. చనిపోయిన వారికి రుయా ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తికాగానే వారి స్వస్థలాలకు పంపిస్తామని తెలిపారు. ఘటన వివరాలను మంత్రులకు ఎస్పీ, కలెక్టర్ వివరించారు. బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. వైఫల్యం ఎవరిదో సీసీ కెమెరాలలో తెలుస్తుంది అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news