ఘనంగా సీనియర్ హీరోయిన్ సుమలత కుమారుడి ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్..!

-

ప్రముఖ దివంగత నటుడు అంబరీష్ సీనియర్ హీరోయిన్ సుమలత దంపతుల కుమారుడు నటుడు అభిషేక్ అంబరీష్ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది . ఆయన ఇటీవల తన ప్రియురాలు అబివా తో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆదివారం అనగా డిసెంబర్ 11న ఉదయం 9:30 గంటలకు బెంగళూరులోని ఒక ప్రైవేటు హోటల్లో వీరి ఎంగేజ్మెంట్ చాలా ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు . ముఖ్యంగా వీరందరి సమక్షంలో కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టడానికి తొలిమెట్టు ఎక్కారు.

ఇకపోతే సినిమా పరిశ్రమ నుంచి కొంతమంది ప్రముఖులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. ఇకపోతే నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తో పాటు కేజిఎఫ్ హీరో యష్, మంత్రి ఆర్. అశోక్, అశ్వద్ధ నారాయణ, సుధాకర్ తదితరులు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరవడం జరిగింది. సుమలత అంబరీష్ తన కుమారుడి నిశ్చితార్థం గురించి రహస్యంగా ఉంచింది. కానీ అందుకు సంబంధించిన ఫోటోలు తాజాగా బయటకి రావడంతో వీరి వివాహం నిశ్చితార్థం జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

ముఖ్యంగా ఈ వేడుకలో రాకింగ్ స్టార్ యష్ ఆయన భార్య రాధికా పండిట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. నిశ్చితార్థం చేసుకున్న జంటకు యష్, రాధికా దంపతులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇకపోతే త్వరలోనే మీరు పెళ్లి తేదీని కూడా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా కొత్త ఏడాది మరొక జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news